పిల్లలలో వడదెబ్బ లక్షణాలు, నివారణకు తీసుకోవలసిన జాగ్రత్తలు

Spread the love

ఉష్ణోగ్రతలు పెరగడం వలన, ఎండల తీవ్రత రోజు రోజుకు పెరుగుతూ వస్తుంది. ఎండాకాలం మొదలవగానే కొందరికి జలుబు అవుతుంది. కొందరికి బాడీ అంతా రాషెస్‌ వస్తుంటాయి మరికొందరికి డిహైడ్రాషన్ కలగడం వలన వడదెబ్బ కలిగే అవకాశం ఉంటుంది. మరి ముఖ్యంగా పిల్లలను జాగ్రత్తగా కాపాడుకోవాలి.

పిల్లలలో వేడి అలసట మరియు వడదెబ్బ సంకేతాలను తెలుసుకోండి.

వడ దెబ్బను సరైన సమయంలో గుర్తించడం వలన పెద్ద ఆరోగ్య సమస్యలను నివారించవచ్చు. మీ పిల్లలు అధిక కాలం ఎండలో గడిపిన తరువాత క్రింది లక్షణాలను ప్రదర్శిస్తే వెంటనే హైడ్రేషన్ థెరపీ చేసి అవసరమైతే మీ పిల్లల డాక్టర్ ను సంప్రదించండి, ఎందుకంటే వడ దెబ్బ తీవ్రత ప్రాణాపాయం కావచ్చు.

హీట్ స్ట్రోక్ లక్షణాలు కనిపించే ముందు, పిల్లలు తరచుగా వేడి తిమ్మిరి మరియు వేడి అలసట వంటి తేలికపాటి వేడి అనారోగ్యాల సంకేతాలు మరియు లక్షణాలను చూపుతారు. పిల్లవాడు వ్యాయామం చేయడం లేదా వేడిలో ఆడుకోవడం మరియు చెమట పట్టడం వల్ల అధిక ద్రవాలు మరియు ఉప్పును కోల్పోవడం వల్ల డీహైడ్రేట్ అయిన తర్వాత ఇది తరచుగా జరుగుతుంది.

వడదెబ్బ లక్షణాలు:

  • సాధారణంగా 100˚ మరియు 104˚ ఫారెన్‌హీట్ మధ్య పెరిగిన శరీర ఉష్ణోగ్రత
  • చెమట పట్టక పోవటం శరీర ఉష్ణోగ్రత పెరగటం,
  • వణుకు రావటం,
  • కలపరింత,
  • మగత నిద్ర,
  • ఫీట్స్ రావటం,
  • వికారం మరియు/లేదా వాంతులు
  • పాక్షికంగా అపస్మారకస్థితిలో ఉండటం
  • శరీరంలో ఎక్కువగా వేడి ఉత్పత్తి కావటం,
  • ప్రతి గంటకు 2-3 లీటర్ల నీటిని చెమట రూపంలో శరీరంలో కోల్పోవడం వడ దెబ్బ లక్షణాలు గా చెప్పవచ్చు.
https://www.goodto.com/wellbeing/symptoms-sun-stroke-heat-exhaustion-77953


ఏ పిల్లలు వడ దెబ్బ కు గురయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది?

  • అధిక బరువు లేదా ఊబకాయంతో ఉన్నారు
  • కొన్ని మందులు వాడుతున్నవారు
  • అనారోగ్యంతో ఉన్నారు
  • తగినంత ద్రవాహారం తీసుకోనివారు.

వడదెబ్బ తగిలినపుడు ఏమిచేయాలి ?


పై లక్షణాల్లో దేనినైనా మీరు అనుమానించినట్లయితే, తక్షణ కార్యాచరణ ప్రణాళికను అనుసరించండి:

  • బిడ్డని నీడగా మరియు చల్లగా ఉండే ప్రదేశానికి తరలించండి, ప్రాధాన్యతగా ఇండోర్ లో ఉంచండి.
  • క్లాస్ట్రోఫోబియా మరియు గందరగోళాన్ని తగ్గించటం కొరకు ఏదైనా అదనపు దుస్తులను తొలగించండి.
  • రోగి చుట్టూ గుంపులు గుంపులుగా ఉండకూడదు, ఒక వ్యక్తి రోగికి సహాయం కావచ్చు.
  • శీఘ్ర శీతలీకరణ – చల్లని షవర్, చల్లని నీటితో స్పాంజ్, ఐస్ ప్యాక్ లు లేదా నుదురు, మెడ, శరీరాన్ని తడి టవల్ తో తుడవండి.

ఎండాకాలం లో ఎటువంటి ఆహరం పిల్లలకు ఇవ్వాలి?

మీ పిల్లలకు ద్రవాహారం ఎక్కువగా ఇవ్వడానికి అధిక ప్రాధాన్యం ఇవ్వండి. ప్రొసెస్డ్ మరియు ప్యాకేజ్డ్ ఫుడ్స్ సాధ్యమైనంతగా దూరం పెట్టండి. ప్రతి గంటకు ఒకసారి పిల్లలకు నీరు త్రాగమని చెప్పండి. మీరు ఇంట్లో ఫ్రూట్ జ్యూస్ చేసి ఇవ్వండి. ఎండాకాలంలో అధిక మేలు చేసే కొన్ని ఆహార పదార్థాలను కింద గుర్తించండి.

1. పుచ్చకాయ:

వేసవిలో అందుబాటులో ఉండే పుచ్చకాయను అస్సలు మిస్ కావద్దు. ఇందులో 91.45 శాతం నీరే ఉంటుంది. పుచ్చకాయ తినడం వల్ల శరీరానికి అవసరమైన నీరు చేరుతుంది. అంతేగాక పుచ్చకాయలో ఉండే యాంటీ ఆక్సైడులు కూడా శరీరానికి అందుతాయి. మీ శరీరాన్ని ఎప్పుడూ కూల్‌గా ఉంచుతాయి.

2. కీర దోసకాయ:

ఈ కాయ కొంచెం వగరుగా ఉన్నా.. శరీరానికి చాలా మేలు చేస్తుంది. ఇందులో బోలెడంత ఫైబర్ ఉంటుంది. వేసవిలో కీర దోసకాయ తింటే అనారోగ్యం దరిచేరదు. పుచ్చకాయ తరహాలోనే కీరదోస కాయాలో కూడా నీటి శాతం ఎక్కువే.

3. నిమ్మకాయ:

ఈ వేసవిలో నిమ్మ రసం తాగడం అస్సలు మరిచిపోకండి. నిమ్మరసం మీకు బోలెడంత శక్తి ఇస్తుంది.

4. పెరుగు:

వేసవిలో పెరుగు తప్పకుండా తినాలి లేదా మజ్జిగా చేసుకుని తాగాలి. ఇది శరీరాన్ని ఎల్లప్పుడు చల్లగా ఉంచుతుంది. పిల్లలకు చల్లటి లస్సి చేసి ఇవ్వండి, బాగా ఇష్టంగా తాగుతారు.

5. కొబ్బరి నీళ్లు:

వేసవిలో కొబ్బరి నీళ్లు తాగడం ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇందులో ఎన్నో విటమిన్లు, మినరల్స్ తదితర పోషకాలు ఉంటాయి. వేడి వాతావరణంలో మీ శరీరానికి శక్తినిచ్చే ఔషదం కొబ్బరి నీళ్లే. రోజూ కొబ్బరి నీళ్లు తాగినట్లయితే క్యాన్సర్ దరిచేరదని పలు పరిశోధనల్లో పేర్కొన్నారు.

6. పుదీనా:

వేసవిలో పుదీనా తినడం లేదా నీటిలో కలుపుకొని తాగడం ఆరోగ్యానికి చాలామంచిది. పెరుగు లేదా సలాడ్‌లో కాసింత పుదీనా కలుపుకుని తాగితే శరీరానికి చలవ చేస్తుంది. ఉదయం టిఫిన్లలోకి పుదీనా పచ్చడి చేసుకుని తింటే ఇంకా మంచిది. పుదీనా మీ శరీరాన్ని చల్లగా ఉంచడమే కాకుండా రిఫ్రెష్ అనుభూతి కలిగిస్తుంది.

7. ఆకు కూరలు:

పుదీనా మాత్రమే కాకుండా ఈ సమ్మర్‌లో ఆకు కూరలు కూడా తినండి. ఎందుకంటే, ఆకు కూరల్లో కూడా నీటి శాతం ఎక్కువ. అయితే, వీటిని బాగా ఉడికించి తినకండి. అలా చేస్తే వాటిలో ఉండే నీటి శాతం తగ్గిపోతుంది.

అదనపు జాగ్రత్తలు:

  • మీ పిల్లలకు లేత రంగు, తేలికైన మరియు తేమను తగ్గించే తగిన దుస్తులను తొడిగించండి.
  • ఉదయం 10గం” నుండి సాయంత్రం 5గం” వరకు పిల్లలను బయటకు పంపకండి
  • ఇంట్లోనే వుండి ఆడే ఆటలను, ఇతర కార్యక్రమాలలో ఎంగేజ్ చేయండి.

డాక్టర్ ను ఎప్పుడు సంప్రదించాలి?

అధిక అలసట, జ్వరం, విరేచనాలు వంటి లక్షణాలు కనబడిన వెంటనే మీ దగ్గరలోని పిల్లల డాక్టర్ను సంప్రదించి తగిన చికిత్స పొందడం ఉత్తమం.


సరయు హాస్పిటల్ సిరిసిల్ల పట్టణములో అనుభవజ్ఞులైన వైద్య బృందం తో పిల్లలకు మరియు మహిళలకు అన్నిరకాల వైద్య సేవలను అందిస్తుంది. ముఖ్యంగా నవజాత శిశు ఎదుగుదల మరియు ఆరోగ్యాన్ని పర్యవేక్షించడానికి అన్ని పీడియాట్రిక్ మరియు నియోనాటల్ క్రిటికల్ కేర్ కేసులకు వన్ స్టాప్ సొల్యూషన్ సిరిసిల్ల పట్టణములో గుర్తింపు పొందడమే కాకుండా, గైనాకాలోజి మరియు ఇంఫెర్టిలిటీ సేవలను ప్రారంభించి ఆనతి కాలంలో ప్రాచుర్యం పొందినది. మరిన్ని వివరాలకొరకు క్రింది నంబర్లను సంప్రదించండి.

Call Us: +91 9704 510 506/ +91 9290 515 070


Spread the love

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *