పిల్లలును డెంగ్యూ నుండి రక్షించడం ఎలా?

వర్షాకాలం మొదలవడం వలన దోమల బెడద పెరిగి; మలేరియా, డెంగ్యూ జ్వరాలు ప్రబలే అవకాశాలు పెరిగి పోతాయి. ముఖ్యంగా మన పిల్లలను వీటి బారిన పడకుండా సంరక్షించాల్సిన బాధ్యత పెద్దలుగా మన మీద వుంది.

దోమ కాటు వలన ప్రబలే వ్యాధులలో డెంగ్యూ జ్వరం ఒక ప్రమాదకరమైనది. ఇది సోకిన రోగి రక్తం లో ప్లేట్లెట్స్ గణనీయంగా తగ్గడం వలన వ్యాధి నిరోధక శక్తి తగ్గి అధిక జ్వరం, తల నొప్పి, నీరసం కల్గుతుంది. డెంగీ వ్యాధిని నిర్లక్ష్యం చేయకూడదు, వెంటనే పిల్లల డాక్టర్ను సంప్రదించడం ద్వారా ప్రాణాపాయం నుండి బయట పడవచ్చు.

డెంగ్యూ నివారణకు కీటక వికర్షకాన్ని ఉపయోగించండి, పొడవాటి చేతుల చొక్కాలు మరియు పొడవాటి ప్యాంటు ధరించండి మరియు మీ ఇంటి లోపల మరియు వెలుపల దోమలను నియంత్రించండి. దోమతెరలు ఉపయోగించడం ఉత్తమం.

ప్రతి సంవత్సరం, డెంగ్యూ సోకిన దోమల కాటు ద్వారా 400 మిలియన్ల మంది ప్రజలు డెంగ్యూ వైరస్ బారిన పడుతున్నారని అంచనా. సరైన సమయం లో దీనిని పసిగట్టడం వలన మానవ రక్తం లోని ప్లేట్లెట్ సంఖ్య తగ్గకుండా నివారించవచ్చు. సాధారణంగా మన శరీరం లో 250,000 నుండి 400,000 వరకు ప్లేట్లెట్లు ఉంటాయి. డెంగ్యూ వైరస్ ప్లేట్లెట్ల మీద దాడి చేసి చంపేస్తుంది. కొన్ని సమయాలలో 20,000 నుండి కిందకు పడిపోయే అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు మీ డాక్టర్ ప్లేట్లెలను ఎక్కించడానికి సలహా ఇవ్వవచ్చు.

డెంగ్యూ లక్షణాలు:

  • అత్యంత సాధారణ లక్షణాలు జ్వరం మరియు కింది వాటిలో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ
  • తలనొప్పి
  • కంటి నొప్పి (సాధారణంగా కళ్ళ వెనుక)
  • కండరాలు, కీళ్ళు లేదా ఎముకల నొప్పి
  • దద్దుర్లు
  • వికారం మరియు వాంతులు

తీవ్రమైన డెంగ్యూ అత్యవసర పరిస్థితి. హెచ్చరిక సంకేతాలను గుర్తించండి:

  • మీరు లేదా కుటుంబ సభ్యులు ఈ హెచ్చరిక సంకేతాలలో దేనినైనా అభివృద్ధి చేస్తే, వెంటనే స్థానిక క్లినిక్ లేదా అత్యవసర గదికి వెళ్లండి: కడుపు లేదా బొడ్డు నొప్పి, సున్నితత్వం
  • వాంతులు (24 గంటల్లో కనీసం 3 సార్లు)
  • ముక్కు లేదా చిగుళ్ళ నుండి రక్తస్రావం
  • వాంతులు రక్తం, లేదా మలంలో రక్తం
  • అలసటగా, చంచలంగా లేదా చిరాకుగా అనిపిస్తుంది

డెంగ్యూ వైరస్ జీవిత చక్రం 2 నుండి 3 వరాలు ఉంటుంది. మానవ శరీరంలో దోమ కాటు ద్వారా ప్రవేశించిన వైరస్ తన జీవిత చక్రం పూర్తి అయ్యేవరకు ఉంటుంది. డెంగ్యూ ను నేరుగా చికిత్స చేయలేము. వ్యాధి నిరోధక శక్తిని పెంచేందుకు మీ డాక్టర్లు మందులు ఇస్తారు.

డెంగ్యూని నిరోధించండం ఎలా?:

  • దోమ కాటును నివారించడం ద్వారా సంక్రమణను నివారించండి.
  • క్రిమి వికర్షక లోషన్లు (ఓడామాస్) ఉపయోగించండి.
  • పొడవాటి చేతుల చొక్కాలు మరియు పొడవాటి ప్యాంటు ధరించండి.
  • పరిసరాలను శుభ్రంగా ఉంచుకోండి.
  • ఇంట్లో వున్నా ఎయిర్ కూలర్లో మరియు గిన్నెలలో చెట్ల కుండీలలో నిలువ నీరు వుంచకండి.
  • వేడి వేడి పోషక ఆహారాన్ని మాత్రమే సేవించండి.

వర్షం కురిసేటప్పుడు అత్యవసరం అయితే మాత్రమే బయటకు వెళ్ళండి. రైన్ కోట్, గొడుగు మరియు ఓడోమాస్ క్రీం ను ఉపయోగించండి. దోమ కాటును నివారించండి డెంగ్యూ ను నివారించండి.


సరయు హాస్పిటల్ సిరిసిల్ల పట్టణములో అనుభవజ్ఞులైన వైద్య బృందం తో పిల్లలకు మరియు మహిళలకు అన్నిరకాల వైద్య సేవలను అందిస్తుంది. ముఖ్యంగా నవజాత శిశు ఎదుగుదల మరియు ఆరోగ్యాన్ని పర్యవేక్షించడానికి అన్ని పీడియాట్రిక్ మరియు నియోనాటల్ క్రిటికల్ కేర్ కేసులకు వన్ స్టాప్ సొల్యూషన్ సిరిసిల్ల పట్టణములో గుర్తింపు పొందడమే కాకుండా, గైనాకాలోజి మరియు ఇంఫెర్టిలిటీ సేవలను ప్రారంభించి ఆనతి కాలంలో ప్రాచుర్యం పొందినది. మరిన్ని వివరాలకొరకు క్రింది నంబర్లను సంప్రదించండి.

Call Us: +91 9704 510 506/ +91 9290 515 070