Intrauterine insemination (IUI) గర్భధారణ విధానం ఎప్పుడు మరియు ఎవరికి చేయవలసి వస్తుంది?

Spread the love

ఇంట్రాయూటెరిన్ ఇన్సేమినేషన్ (IUI) – ఒక రకమైన కృత్రిమ గర్భధారణ – ఇంఫెర్టిలిటీ (వంధ్యత్వాని) కి చికిత్స చేసే ప్రక్రియ.

స్త్రీల అండాశయం ఫలదీకరణం కోసం ఒకటి లేదా అంతకంటే ఎక్కువ గుడ్లను విడుదల చేసే సమయంలో పరిశుభ్రమైన మంచికదలిక వున్న స్పెర్మ్ నేరుగా గర్భాశయంలో ప్రేవేశ పెడతారు.

సాధారణంగా స్త్రీ, పురుషుల మధ్య కలయిక తరువాత పురుషుల స్పెర్మ్ లోని మంచి కదలిక కల్గిన శుక్ర కణాలు ఫెలోపియన్ ట్యూబ్స్ లో ఈదుకుంటూ ముందుకు సాగి అక్కడ వేచివున్న గుడ్డుతో అధిక శక్తివంతమైన శుక్రకణం ఫలదీకరణం చెందటం వలన గర్భం దాల్చడం జరుగుతుంది. ఇంఫెర్టిలిటీ తో బాధపడే దంపతులలో కొన్ని సార్లు IUI పద్దతిలో ఫలదీకరణం అవసరం రావచ్చు.

IUI ఎప్పుడు, ఎవరికి చేస్తారు?

ఈ కృత్రిమ గర్భధారణ పద్దతి ముఖ్యంగా పురుష ఇంఫెర్టిలిటీ వున్న దంపతులలో అవలంభించవలసి రావచ్చు. క్రింది సమయాలలో IUI అవసరం రావచ్చు.

వివరించలేని ఇంఫెర్టిలిటీ :

మహిళలలో మరియు పురుషులలో అన్ని పరీక్షలు చేయగా అన్ని అనుకూలంగా ఉండి, వివరించలేని కారణాలు ఇంఫెర్టిలిటీ కి దారితీసినప్పుడు IUI పద్దతిని చికిత్సకు ఉపయోగిస్తారు.

ఎండోమెట్రియోసిస్-సంబంధిత ఇంఫెర్టిలిటీ:

ఎండోమెట్రియోసిస్‌కు సంబంధించిన వంధ్యత్వానికి, IUI చేయడంతోపాటు మంచి-నాణ్యత గుడ్డును పొందేందుకు మందులను ఉపయోగించడం తరచుగా మొదటి చికిత్సా విధానం.

తేలికపాటి పురుష కారకం వంధ్యత్వం (సబ్ఫెర్టిలిటీ):

పురుషుడి యొక్క వీర్య విశ్లేషణ అనేది ఇంఫెర్టిలిటీ కి సంబంధించిన వైద్య అంచనాలో మొదటి దశలలో ఒకటి, స్పెర్మ్ ఏకాగ్రత (గాఢత) సగటు కంటే తక్కువ, బలహీనమైన కదలిక (చలనశీలత) లేదా స్పెర్మ్ పరిమాణం మరియు ఆకృతిలో అసాధారణతలు (పదనిర్మాణం) చూపవచ్చు. IUI ద్వారా ఈ సమస్యలలో కొన్నింటిని పరిష్కరించవచ్చు. ఎలాగంటే IUI ప్రక్రియ కోసం స్పెర్మ్‌ను సిద్ధం చేయడం వలన తక్కువ నాణ్యత కలిగిన వాటి నుండి అధిక చలనశీలమైన, సాధారణ స్పెర్మ్‌ను వేరు చేయడం జరుగుతుంది.

గర్భాశయ కారకం వంధ్యత్వం:

స్త్రీ గర్భాశయం అండోత్సర్గము సమయంలో ఉత్పత్తి చేసిన శ్లేష్మం స్పెర్మ్ ని యోని నుండి ఫెలోపియన్ ట్యూబ్‌లకు ప్రయాణించడానికి అనువైన వాతావరణాన్ని అందిస్తుంది. కానీ, కొందరిలో గర్భాశయ శ్లేష్మం చాలా మందంగా ఉంటే, అది స్పెర్మ్ ప్రయాణానికి ఆటంకం కలిగిస్తుంది. గర్భాశయం కూడా గుడ్డులోకి స్పెర్మ్ చేరకుండా నిరోధించవచ్చు. అటువంటి సమయం లో IUI అవసరం వస్తుంది.

అండోత్సర్గము కారకం వంధ్యత్వం:

అండోత్సర్గము లేకపోవటం లేదా తక్కువ సంఖ్యలో గుడ్లు ఉండటంతో సహా అండోత్సర్గము సమస్యల వలన వంధ్యత్వం ఉన్న మహిళలకు కూడా IUI నిర్వహించబడవచ్చు.

వీర్యం అలెర్జీ:

అరుదుగా, వీర్యంలోని ప్రోటీన్లకు అలెర్జీ వంధ్యత్వానికి కారణమవుతుంది. యోనిలోకి స్కలనం ఎర్రబడటం, మంట మరియు వాపుకు కారణమవుతుంది. ఇటువంటి సందర్భం లో IUI అవసరం వస్తుంది. స్పెర్మ్ ను స్టెరిలైజ్ చేసి గర్భాశయంలో ప్రెవేశపెడతారు.

దాత స్పెర్మ్ అవసరమైనప్పుడు:

గర్భం దాల్చడానికి దాత స్పెర్మ్‌ను ఉపయోగించాల్సిన మహిళలకు, IUI ఫలదీకరణ ద్వారా గర్భధారణ చేస్తారు. ఘనీభవించిన దాత స్పెర్మ్ నమూనాలు ధృవీకరించబడిన ల్యాబ్‌ల నుండి తీసుకొని సాధారణ ఉష్ణోగ్రతల ఉంచగా అవి కరిగిన తరువాత గర్భాశయంలోకి ప్రవేశ పెడతారు.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు:


గర్భాశయంలోని గర్భధారణ (IUI ) అనేది సాపేక్షంగా సులభమైన మరియు సురక్షితమైన ప్రక్రియ. మంచి అనుభవం వున్నా ఇంఫెర్టిలిటీ మరియు స్త్రీవ్యాధి నిపుణుల దగ్గర చేయిచాడం వలన మంచి ఫలితాన్ని ఇవ్వడమే కాకుండా ఎటువంటి side effects మరియు infections లేకుండా చేయవచ్చు.

Sarayu hospital, IUI process

IUI చేసి విధానం:

స్త్రీ గర్భాశయం ను అల్ట్రాసౌండ్ ద్వారా డాక్టర్ క్షున్నంగా పరిశీలిస్తారు. గుడ్డు విడుదల అయిందని నిర్ధారించిన వెంటనే. పురుష స్పెర్మ్ ను సిద్ధం చేస్తారు. దాత స్పెర్మ్ అయితే సర్టిఫైడ్ లాబ్స్ నుండి తెప్పించి ఘనీభవించిన స్పెర్మ్ ను సాధారణ ఉష్ణోగ్రతలో ద్రవం గా చేస్తారు. భాగస్వామి స్పెర్మ్ అయితే సేకరించిన తరువాత సెంట్రిఫ్యుస్ చేసి ఫలదీకరణకు అడ్డంకి గ వుండే కారకాలను శుభ్రపరిచి ఆరోగ్యకరమైన స్పెర్మ్ ను క్యాథెటెర్ ద్వారా గర్భాశయంలోకి ప్రెవేశ పెడతారు.

IUI ప్రక్రియ కు 15 నుండి 20 నిమిషాల సమయం పడుతుంది. ఇది ఇంఫెర్టిలిటీ సెంటర్లో లేదా మీ gynecology క్లినిక్ లో చేస్తారు. ఇఫెర్టిలిటీ ట్రీట్మెంట్ లో భాగంగా మొదట ఈ ప్రక్రియ లో గర్భధారణ ను ప్రయత్నించవచ్చు.


సరయు హాస్పిటల్ సిరిసిల్ల పట్టణములో అనుభవజ్ఞులైన వైద్య బృందం తో పిల్లలకు మరియు మహిళలకు అన్నిరకాల వైద్య సేవలను అందిస్తుంది. ముఖ్యంగా సంతానం కోసం పరితపించే దంపతులకు అధునాతన వైద్యం తో సంతాన ప్రాప్తిని కలిగిస్తారు. Dr .T. రవళి (MS OBG, Infertility Specialist) గారు సంతాన సాఫల్య వైద్య విద్యను అభ్యసించి, మన సిరిసిల్ల దంపతులకు సేవ చేయడానికి సరయు హాస్పిటల్ లో అందుబాటులో వున్నారు. Appointment కొరకు క్రింది నుంబర్లను సంప్రదించండి.

Call Us: +91 9704 510 506/ +91 9290 515 070


Spread the love

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *